తరుణ్ భాస్కర్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!

Tarun Bhaskar New Movie Title Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tarun Bhaskar,Director Tarun Bhaskar,Tarun Bhaskar New Movie,Tarun Bhaskar Movie,Tarun Bhaskar Telugu Movie,Tarun Bhaskar Upcoming Movie,Tarun Bhaskar New Movie Titled Released, Tarun Bhaskar Upcoming Movie Tilted Announced,Tarun Bhaskar New Telugu Movie Titled Announced,Keedaa Cola Movie,Keedaa Cola,Keedaa Cola Telugu Movie,Tarun Bhaskar Movie Keedaa Cola, Tarun Bhaskar Upcoming Movie Keeda Cola,Tarun Bhaskar latest Movie Keeda Cola,keeda Cola Latest Movie Updates

తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఆ సినిమా కూడా డీసెంట్ హిట్ నే అందించింది. ఇక తరువాత తరుణ్ భాస్కర్ నుండి ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే హీరోగా మాత్రం ఒక సినిమా చేశాడు. దాని తరువాత ఆమధ్య వెంకీ తో సినిమా చేస్తున్నాడు అన్నారు. అయితే అది నిజమే అయినా కూడా ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చాలా లాంగ్ గ్యాప్ తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీతో రాబోతున్నాడు. విజి సైన్మా మొదటి ఫీచర్ లెంగ్త్ ప్రొడక్షన్ గా నిర్మాతలు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి ‘కీడా కోలా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. కీడా అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్ పై టైటిల్ రాసి ఉంది. అలాగే పోస్టర్ లో ఒక పురుగుని కూడా చూపించారు. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. “మునుపెన్నడూ చూడని క్రైమ్ కామెడీని ఎక్సపీరియన్స్ చేయండి…” అని మేకర్స్ వెల్లడించారు.

కాగా ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =