బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీ, అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నటించే మూవీస్ లో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A beautiful performer with ever smiling face and abundance of talent.
Welcome aboard Dazzling Beauty @IamKrithiShetty ❤️
Next Announcement Will Enthrall You Today at 11:08 AM 💥#NC22Begins ❤️🔥#NC22 @chay_akkineni @vp_offl @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/lElNozesjE
— Srinivasaa Silver Screen (@SS_Screens) June 23, 2022
సూపర్ హిట్ “బంగార్రాజు ” మూవీ లో నాగచైతన్య కు జోడీగా నటించిన కృతిశెట్టి , మరోసారి నాగచైతన్యకు జోడీగా నటించనున్నారు. పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా “#NC 22” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి ఎంపిక అయినట్టు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: