బాలీవుడ్ లో “ఆర్ ఆర్ ఆర్” తో డెబ్యూ హీరోగా ఎన్టీఆర్ రేర్ రికార్డ్

Jr NTR Broke a record with RRR in Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Latest Updates,Jr NTR Broke a Record with RRR Movie,Jr NTR Broke Record with RRR Movie in Bollywood,Jr NTR broke Record in Bollywood, Jr NTR RRR Movie in Bollywood,Jr NTR Latest Record in Bollywood,Jr NTR latest Movie Updates,Jr NTR Movies,Jr NTR Upcoming Movies,Jr NTR New Movies,Jr NTR Next Projects, Jr NTR RRR Movie in Hindi Version Broke Records in Bollywood

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ లు “ఆర్ ఆర్ ఆర్”మూవీని ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ఆర్ఆర్” మూవీ అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం.”ఆర్ ఆర్ ఆర్ ” మూవీతో బాలీవుడ్‌లో ప్రభాస్, యశ్, రామ్ చరణ్‌కు సాధ్యం కానీ రికార్డు ను ఎన్టీఆర్ క్రియేట్ చేసారు. ఎన్టీఆర్ తొలి ప్యాన్ ఇండియా మూవీతో హిందీలో రూ. 300 కోట్లు వసూలు చేసిన డెబ్యూ హీరోగా రికార్డులకు ఎక్కారు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 326 కోట్ల గ్రాస్ రాబట్టింది. హీరో ప్రభాస్ నటించిన “బాహుబలి1” సినిమా అక్కడ రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. యశ్ హీరోగా నటించిన “కే జీ ఎఫ్ చాప్టర్ 1″మూవీ రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లనే రాబట్టింది. ఇక రామ్ చరణ్‌కు తొలి ప్యాన్ ఇండియా మూవీ అయినా.. అంతకు ముందు హిందీలో జంజీర్‌”మూవీ తో అక్కడి ప్రేక్షకులను పలకరించారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ అక్కడ రూ. 100 కోట్ల కు పైగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =