నెటిజన్ల ట్రోలింగ్.. మీ పని మీరు చూసుకోండి అంటున్న సామ్..!

Samantha Gives a Strong Reply to Netizens,Samantha Suggests Fans To Move On After Her Divorce With Naga Chaitanya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Tollywood Star Actress Samantha,Samantha Latest Updates,Samantha Latest Comments on Fans,Samantha About Her Divorce,Samantha latest News, Samantha Suggests Fans to Move on after Divorce with Hero Naga Chaitanya,Samantha About Her Divorce with Fans,Samantha Abut Her Divorce with Naga Chaitanya, Samantha Upcoming Movies,Samantha New Movie Updates,Samantha latest Movies,Samantha Latest Shooting Updates,Samantha Latest Movie Shooting

సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీల మీద ట్రోలింగ్ లు రావడం కామన్ థింగే. ఇక సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు సైలెంట్ గా ఉన్నా.. కొన్ని సార్లు మాత్రం స్ట్రాంగ్ గానే రిప్లైలు ఇస్తుంటారు. అందులో స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ ముందే ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు సామ్ రీకౌంటర్లు ఇస్తూనే ఉంటుంది. ఇక చై-సామ్ విడాకుల సమయంలో సామ్ మరింత ఎక్కువగా ట్రోలింగ్ ను ఎదుర్కొంది. చై-సామ్ విడిపోయిన తరువాత ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయిపోయారు. ఒకపక్క సామ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ బిజీ అయిపోయింది.. మరోవైపు చై కూడా సినిమాలు చేస్తూనే డిజిటల్ ఎంట్రీకి కూడా రెడీ అయిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా విడాకుల అనంతరం సామ్ కు సోషల్ మీడియా వేదికగా కాస్త ట్రోలింగ్ ఎక్కువైందని చెప్పొచ్చు. ఇక నెటిజన్ల ట్రోలింగ్ సామ్ కూడా ఎక్కడా తగ్గకుండా స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తూనే ఉంది. ఇక తాజాగా మరోసారి సామ్ నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా చై ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడన్న వార్తలు తెరపైకి వచ్చాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. చై ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడానికే సమంత పీఆర్ టీమ్‌ ఇలాంటి రూమర్స్‌ సృష్టిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈవార్తలపై స్పందించిన సామ్ అమ్మాయిలపై పుకార్లు వస్తే నిజమే కానీ అబ్బాయిలపై వస్తే మాత్రం అమ్మాయిలే చేయించారని ప్రచారం చేస్తారు.. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్లు ముందుకెళ్లిపోతున్నారు. మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ పని మీద, మీ కుటుంబాల విషయాల మీద దృష్టి పెట్టండి’అని సమంత కౌంటర్ ఇచ్చింది. మరి ఈ విషయం ఇక్కడితో ఆగిపోతుందో? లేదో? చూడాలి..

ఇక చై-సామ్ సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య హీరోగా నటించిన ‘థాంక్యూ’, లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ‘దూత’అనే వెబ్‌ సిరీస్‌ కూడా త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. తెలుగులో యశోదా, శాకుంతలం చిత్రాలు చేస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =