టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. రామ్ పోలీస్ పాత్రలో నటించడం ఇదే మొదటి సారి. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా జూలై 14న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇప్పటికే చాలా అప్ డేట్లు వచ్చాయి. ఒకపక్క పోస్టర్లు రిలీజ్ చేస్తూనే మరోపక్క పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి పాట బుల్లెట్ బండి పాట సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక టీజర్ కూడా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.‘విజిల్’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను జూన్ 22 సాయంత్రం 7.12 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేశారు.
You heard the #BULLETSong ..
Now,It’s time for the #WHISTLESong!!
Love..#RAPO #TheWarriorr #TheWarriorrOnJuly14 pic.twitter.com/faUv7hmGQL
— RAm POthineni (@ramsayz) June 20, 2022
కాగా ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. అక్షర గౌడ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: