`డర్టీ హరి` లాంటి థ్రిల్లర్ కమ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు ఎం.ఎస్ రాజు. ఈసినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడంతోనే అలాంటి విజయం అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈసినిమా కూడా యూత్ ను టార్గెట్ చేసి తీసినట్టే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి ట్రైలర్లను అర్థమవుతుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ రెండు ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మూడో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫన్ అండ్ ఎనర్జిటిక్` ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ చెప్పినట్టే ఈ మూడో ట్రైలర్ కూడా చాలా ఫన్ గా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Have a look at the wholesome glimpse of our crazy flick #7Days6Nights 🏖️
Here’s the Release Trailer ▶️ https://t.co/b1fq47rLmV@MSumanthAshwin @RajnikantSOffl @SamarthGollapu5 @SumanthArtPro @WildHoneyPro #WintagePictures @AbgCreations @PulagamOfficial#7Days6NightsOnJune24th pic.twitter.com/DmXjoYLdQv
— MS Raju (@MSRajuOfficial) June 20, 2022
కాగా ఈసినిమాలో సుమంత్ అశ్విన్ సరసన మెహర్ చావల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరిద్దరితో పాటు రోహన్, కృతికా శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్ .ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. ఈసినిమాకు సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: