వంద శాతం లాభాలతో “విక్రమ్”

Vikram Movie Gets 100 Percent Profits Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Movie Updates,Vikram Latest Movie Updates,Vikram Collections Updates,Vikram Movie 100 percent Profit, Vikram Movie Overseas Collections,kamal Haasan Vikrma Movie,kamal Haasan Vikram Movie collections,Kamal Haasan Vikram Movie Profits,Vikram Movie Profits, Vikram Movie In Profits,Vikram Movie Collected Profits,Vikram Movie Box Office Collections,Vikram Movie Record Collections

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “విక్ర‌మ్”మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్రమ్ ” తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పది రోజులలో 300 కోట్ల క్లబ్ లో చేరిన “విక్రమ్ ” మూవీ తెలుగు వెర్షన్ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కి చేరడం విశేషం. తాజా సమాచారం ప్రకారం, “విక్రమ్” సినిమా తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ 6 కోట్ల రూపాయలకు కొనగా ప్రస్తుతం ఈ సినిమాకు 13 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చింది. అలా వందశాతం లాభాలు అందుకున్నారు బయ్యర్లు, నిర్మాతలు. అటు షేరింగ్ కింద సినిమాను ఇచ్చిన కమల్ హాసన్ కూడా లాభపడుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here