టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రాజా వారు రాణి వారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సమ్మతమే అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా సమ్మతమే సినిమా వస్తుంది. ఈసినిమా జూన్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది. ఇప్పటికే రిలీజైన టీజర్ యూత్‌ను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలంగాణ మంత్రి కేటీఆర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను చూస్తుంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. ‘ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మీ. వాళ్లు లేని ఇళ్లు ఇలాగే ఉంటుంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకునేలా ఉంది. పెళ్లి, అమ్మాయి కోసం ఎదురుచూసే ఓ యువకుడి కథగా ‘సమ్మతమే’ సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. లైఫ్ లో నీకు గోల్ ముఖ్యమా .. గాళ్ ముఖ్యమా’ అని హీరోయిన్ అడిగితే, ‘నా లైఫ్ లోకి గాళ్ రావడమే నా గోల్’ అనే హీరో డైలాగ్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ‘లైఫ్ లో నీకు ఏ అమ్మాయి కరెక్ట్ కాదు..’ అంటూ హీరోపై హీరోయిన్ కోపాన్ని వ్యక్తం చేసే సీన్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Gold chain vesukunanduku innalaki vachindi golden opportunity ☺️https://t.co/3BL4z6bCZe
Thank you @KTRTRS gaaru for launching ☺️#Sammathame #SammathameFromJune24th pic.twitter.com/U6OuGj5g4f
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 16, 2022
కాగా ఈసినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ ఈసినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: