‘బ్రహ్మాస్త్రం’ టీమ్ హార్ట్ ఫుల్ థ్యాంక్స్..!

Brahmastra Team Thanks Audience for the Amazing Response for Trailer,Ayan Mukerji Thanks Audience For Brahmastra Trailer Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Telugu Version Movie,Brahmastra Trailer,Brahmastra Movie Trailer Response,Brahmastra Telugu Movie Trailer Response, Brahmastra Trailer Response,Brahmastra Trailer Audience Response,Ayan Mukerji About Brahmastra Trailer Response,Ayan Mukerji Thanks Audience For Brahmastra Movie Trailer Response, Ayan Mukerji The Creator of Brahmastra,Brahmastra is Ayan’s dream film,Ayan penned a heartfelt note in Twitter,Ayan Mukerji Thanks Audience,

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన చిత్రం‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక విజ్యువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ వన్ ‘బ్రహ్మాస్త్రం- శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ కు ఇంకా రెండు మూడు నెలలు వరకూ టైమ్ ఉన్నా కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మాత్రం ఇప్పటి నుండే మొదలు పెట్టారు. ఒక వైపు గ్లింప్స్, పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉండగా.. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఉండటంతో ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ మూవీ కచ్చితంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక మరోవైపు ఈట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ పై చిత్రయూనిట్ స్పందిస్తూ హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెబుతూ ఓ నోట్ ను కూడా పోస్ట్ చేశారు. బ్రహ్మాస్త్ర జర్నీలోనే ట్రైలర్ రిలీజ్ రోజు చాలా బిగ్ మూమెంట్.. ఈ ట్రైలర్ ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికీ హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్. మీకు ద బెస్ట్ ఇవ్వడానికి మేము చాలా ఎనర్జీతో వర్క్ చేశాము.. బ్రహ్మాస్త్ర మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది.. గర్వపడేలా చేస్తుందన్న నమ్మకం ఉంది.. అంటూ పోస్ట్ లో తెలిపారు. మరి ట్రైలర్ అయితే విజువల్ వండర్ గా ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here