చరణ్ తో డేట్ వెళ్లేదాన్ని.. మిస్ యూనివర్స్ షాకింగ్ కామెంట్స్..!

Miss Universe Comments on Ram Charan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Manushi Chhillar,Miss Universe Manushi Chhillar,Manushi Chhillar About Ram Charan,Manushi Chhillar Date With Ram Charan,Manushi Chhillar Comments on Ram charan, Manushi Chhillar About Ram Charan Date,Manushi Chhillar Samrat Prithviraj Movie Latest Updates,Miss Universe Manushi Chhillar Latest Movie Updates, Manushi Chhillar Movie Updates,Manushi Chhillar Upcoming Movie Updates,Manushi Chhillar New Movie Updates

ఇప్పటివరకూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. ఇక మొదటి సినిమాతోనే నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ నార్త్ లో ఏ రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు. రామ్ చరణ్ ఇంటెన్స్ తో చేసిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఏకంగా చరణ్ కు మిస్ యూనివర్సే ఫిదా అయిపోయింది. మిస్ యూనివ‌ర్స్ కిరీటాన్ని అందుకుని.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఎంట్రీ ఇస్తోంది మానుషి చిల్లర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్షయ్ కుమార్ హీరోగా పృథ్విరాజ్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ద్వారా మానుషి చిల్లర్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈసినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్ననేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో డేట్‌కు వెళ్లాలంటే ఎవరితో వెళ్తారు అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె రామ్ చరణ్‌తో డేటింగ్‌కు వెళ్లాలని ఉందని.. పెళ్లికాకుంటే వెళ్లేదాన్ని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ప్రస్తుతం మానుషి చిల్లర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

కాగా ఈఏడాది ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో అలరించిన చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చరణ్ పొలిటీషియన్ గా కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.