‘విరాటపర్వం’ సెకండ్ సింగిల్ నగాదారిలో సాంగ్ రిలీజ్..!

Virata Parvam Movie second single out now,Rana Daggubati’s Virata Parvam Second Single Nagaadaarilo Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Telugu Movie,Virata Parvam Movie Updates,Virata Parvam Movie Song,Virata Parvam Second Single,Rana Daggubati Virata Parvam Movie Second Single Out Now, Rana Daggubati Movie Updates,Rana Daggubati latest Movie Updates,Rana Daggubati New Movie Updates,Rana Daggubati Upcoming Movie Virata Parvam Second Single

టాలెంటెడ్ హీరో రానా హీరోగా వస్తున్న సినిమా విరాట‌ప‌ర్వం. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో రానా భీమ్లానాయక్ కూడా చేసి బ్లాకా బస్టర్ అందుకున్నాడు. నిజానికి ఈసినిమా కూడా విరాటపర్వం కన్నా వెనుకే మొదలైనా కూడా ఎప్పుడో రిలీజైపోయింది. ఎట్టకేలకు ఎన్నో అనుమానాలు, కన్ఫ్యూజన్ ల నేపథ్యంలో రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ముందు జులై 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.. కానీ రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రీపోన్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జూన్ 17వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలో రెండు వారాలు టైమ్ ఉండటంతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇటీవలే ఒకపాట రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కాగా తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘నగాదారిలో’అనే టైటిల్ తో సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈపాటకు నరేంద్ రెడ్డి, సనాపాటి భరద్వాజ్ లిరిక్స్ అందించగా, సింగర్ వరం పాడాడు.

కాగా ఈసినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంకా నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్నారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =