న్యాచురల్ స్టార్ నాని, మలయాళ టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా హీరో హీరోయిన్లుగా తెరెక్కుతున్న సినిమా అంటే సుందరానికి. ఈ కాంబినేషన్ తోనే సినిమాపై ఆసక్తిని నెలకొల్పారు మేకర్స్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్‌లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. ఇక ఈసినిమా జూన్ 10వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే నాని, నజ్రియా వెరైటీగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు సిద్దమయ్యారు మేకర్స్. తాజాగా ఈసినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా ట్రైలర్ కు సంబందించిన అప్ డేట్ ను మే 30వ తేదీన ఉదయం 11గంటల 7 నిమిషాలకు ఇస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు.
Team is super excited 🙂 #AnteSundaraniki#AdadeSundara#AhaSundara pic.twitter.com/x6Y2P5ZAsn
— Nani (@NameisNani) May 28, 2022
కాగా ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: