నందమూరి తారక రామారావు నట విశ్వరూపం

Interesting Fact about Sr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sr NTR,Sr NTR Ex Chief Minister,Sr NTR Interesting Facts,Nandamuri Taraka Ramarao,Interesting Facts About Nandamuri Taraka Ramarao,Nandamuri Taraka Ramarao About Sr NTR, Sr NTR Interesting Facts,Sr NTR Birth Anniversary,Sr NTR 100 Birth Anniversary,Jr NTR,Kalayan Ram,Jr NTR Upcoming Movies,Jr NTR New Movie Updates

“మన దేశం ” (1949 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నందమూరి తారక రామారావు సాంఘిక , పౌరాణిక , జానపద , చారిత్రాత్మక జానర్ లో సుమారు 300 సినిమాలలో నటించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించారు.పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా మారిన ఎన్టీఆర్ రాముడు , కృష్ణుడు వంటి పాత్రలే కాకుండా రావణ బ్రహ్మ , దుర్యోధనుడు , కీచకుడు వంటి ప్రతి నాయక పాత్రలలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడు , నిర్మాత , దర్శకుడు , స్టూడియో అధినేత గా కళామతల్లికి సేవలు అందించిన ఎన్టీఆర్ ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1982 సంవత్సరం లో తెలుగు దేశం పార్టీ ని స్థాపించిన ఎన్టీఆర్ 1983 సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్టీఆర్ పేద ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు. తన నట విశ్వరూపం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేశారు. ఆ మూవీ ఘనవిజయం సాధించి, హిందీ , తమిళ , మలయాళ , కన్నడ భాషలలో రీమేక్ అయ్యి ఆయా భాషలలో ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ నిర్మాత , దర్శకుడిగా తెరకెక్కిన “దాన వీర శూర కర్ణ “(1977 ) లో కృష్ణుడు , దుర్యోధనుడు , కర్ణుడు గా త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. 10 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రెండు కోట్లు వసూళ్ళు సాధించడం విశేషం. “శ్రీమద్విరాట పర్వం”(1979) మూవీ లో కృష్ణుడు , దుర్యోధనుడు , అర్జునుడు , బృహన్నల , కీచకుడు వంటి 5 పాత్రలలో అద్భుతంగా నటించి ఎన్టీఆర్ తన నట విశ్వరూపం ప్రదర్శించారు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + thirteen =