మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా జోడించి పక్కా కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఫైనల్ గా జులై 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాదు మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు. ఈమధ్యనే ఈసినిమా నుండి మొదటి సాంగ్ చుక్కా ముక్కా కమర్షియలే అన్న పాటను రిలీజ్ చేయగా ఆపాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఈపాటను దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. రెండో పాటను జూన్ 1న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Macho star @YoursGopichand & @DirectorMaruthi ‘s #PakkaCommercial 2nd Single will be out on 𝐉𝐔𝐍𝐄 𝟏𝐬𝐭!! ❤️
A @JxBe Musical 🎹#AlluAravind @RaashiiKhanna_ #BunnyVas #KarmChawla @SKNonline @GA2Official @UV_Creations @adityamusic
In theatres #PakkaCommercialOnJuly1st ✨ pic.twitter.com/FwFtfUjtyq
— UV Creations (@UV_Creations) May 26, 2022
కాాాగా ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో సత్యరాజ్ మరోసారి కీలక పాత్రలో నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: