సెన్సార్ పూర్తి చేసుకున్న ‘విక్రమ్’

Vikram Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vikram,Vikram Movie,Vikram Movie Latest News,Vikram Movie Live Updates,Vikram Movie Censor Report,Vikram Movie Censor Verdict,Vikram Movie Completed Censor Formalities

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో నటించగా.. ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈసనిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగులో స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 400కు పైగా థియేటర్లలో ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో నితిన్ తండ్రి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి నేడు కమల్ హాసన్‌ను చెన్నైలో కలిశారు. ఈ సందర్భంగా విక్రమ్ తెలుగు పోస్టర్‌ను కమల్ హాసన్‌కి అందించారు. కమల్ హాసన్ తో పాటు చిత్ర యూనిట్ తో తెలుగులో గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఈసినిమాలో కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =