వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘అంటే సుందరానికి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఒక బ్రాహ్మణ యువకుడికి, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించనునట్లు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ చేయగా. రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రంగో రంగా అనే పాటను నేడు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పిన నేపథ్యంలో తాజాాగా ఈపాటను రిలీజ్ చేశారు. ఈపాట కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సనాపతి భరద్వాజ్ పాత్రుడు రాసిన సాహిత్యం చాలా ఫన్నీగా ఉండగా.. కారుణ్య ఈపాటను పాడాడు.
Everyone can relate to the irony of life 🫠#RangoRanga song from #AnteSundaraniki out now 🎧❤️
Natural ⭐ @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nckarunya @Patrudu1729 @nikethbommi @saregamasouth pic.twitter.com/JlRu14dQ3Y
— Mythri Movie Makers (@MythriOfficial) May 23, 2022
కాగా ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: