తండ్రి గురించి ‘నిఖిల్’ ఎమోషనల్ పోస్ట్..!

Actor Nikhil Emotional Post about his Father,Nikhil Siddhartha Pens An Emotional Note On His Father’s Demise,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nikhil Siddhartha,Hero Nikhil Siddhartha,Nikhil Siddhartha Pens an Emotional Note,Nikhil Siddhartha Emotional Note on His Fathers Demise,Nikhil Siddhartha Emotional Note To his Father Goes Viral In social Media, Nikhil Siddhartha Pens An Emotional Note on his Father Shyam Siddhartha Demise,Nikhil Siddhartha Pens An Emotional Note in Twitter,Nikhil Siddhartha Pens An Emotional Note Goes Viral In Social Media

టాలీవుడ్ యంగ్ హీలో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ‌ నిన్న మరణించిన సంగతి తెలిసిందే కదా. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఇప్పటికే నిఖిల్ కుటుంబానికి అందరూ సంతాపం తెలియచేశారు. ఈనేపథ్యంలో తన తండ్రిని మరోసారి గుర్తుచేసుకొని సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ భావోద్వేగం అయ్యారు. మా నాన్నగారి మరణంతో క్రుంగిపోయాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్‌ యూ అంటూ తన తండ్రితో పంచుకున్న తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో సమ్మర్‌ను ఎంజాయ్‌ చేయడం.. ఇవన్నీ నేను మిస్‌ అవుతాను. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన తండ్రి ఔన్నత్యాన్ని గురించి చెబుతూ.. మంచి మనసున్న వ్యక్తి ఆయన. ఎంతోమంది విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేసేవారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేవాడు. ఆయనకు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరావు అంటే ఎంతో ఇష్టం.. వాళ్లకు వీరాభిమాని. అందుకే నన్ను కూడా వెండితెరపై చూడాలని కలలు కన్నాడు. ఆయన ప్రోత్సాహం అందించడం వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. జేఎన్‌టీయూ ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌లో ఆయన స్టేట్‌ టాపర్‌. ఎప్పుడూ కష్టాన్ని నమ్మేవాడు.. జీవితాన్ని ఎంజాయ్‌ చేద్దామనుకునే సమయంలో అరుదైన వ్యాధిబారిన పడ్డాడు. కార్టికోబాసల్‌ డీజెనరేషన్‌ అనే వ్యాధితో ఎనిమిదేళ్లుగా పోరాడాడు. చివరికి ఈ పోరాటంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు. నిన్ను తలచుకోని రోజు ఉండదు డాడి అని భావోద్వేగంతో ట్వీట్‌ చేశాడు. ఇక ఈపోస్ట్ తో నిఖిల్ తన తండ్రితో ఎంత క్లోజ్ బాండింగ్ ఉండేదో అర్థమవుతుంది. మరి ఈసందర్భంగా తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.