నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా చేస్తున్న సినిమా బీస్ట్. ఈసినిమా విజయ్ కెరీర్ లో వస్తున్న 65వ సినిమా. ఇక సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక చిత్రయూనిట్ కూడా ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసింది. ఇక సినిమా ఇప్పటికే ఈసినిమా నుండి విజయ్ కు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ సాంగ్ ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ‘జాలీ ఓ జింఖానా’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌లో విజయ్, పూజా వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా తాజాగా రన్ టైమ్ ను లాక్ చేసుకుంది. 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ ఈసినిమాకు లాక్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలలో నటిస్తున్నాడు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో తెలియచేయనున్నారు మేకర్స్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: