‘ధమాకా’.. వింటేజ్ రవితేజ ను చూస్తారు..!

Mass Maharaj Ravi Tejas Dhamaka Movie Writer Prasanna Kumar about the film,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ravi Teja,Mass Maharaja Ravi Teja,vintage Ravi Teja,Ravi Teja latest Movies,Ravi Teja Movie Updates,Ravi Teja Movie News,Ravi Teja Dhamaka Movie Updates,Dhamaka Movie Songs shooting, Prasanna Kumar Bezawada story screenplay and dialogues of Ravi Teja-starrer Dhamaka,Ravi Teja and Sreeleela Song in Spain,Shaker Master,Dhamaka Movie Shooting At Spain, Mass Maharaja is playing dual roles—one in mass avatar as Swamy and the other as a corporate guy Anand Chakravaty,Ravi Teja and Sreeleela Shoot for a song in spain, Ravi Teja Dual Role in Dhamaka movie,Malayalam actor Jayaram In Dhamaka Movie,Jayaram is the villain in Dhamaka Movie,jayaram Playing First time Villain Role In Dhamaka Movie, Rao Ramesh and Hyper Aadi have shaped up hilariously well,Dhamaka has completed five schedules so far and about 25 days of shooting remain,#Dhamaka

రీసెంట్ గానే ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఈ ఏడాదే పలు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక వాటిలో ధమాకా కూడా ఒకటి. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా రీసెంట్ గానే స్పెయిన్ కు వెళ్లి అక్కడ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు వచ్చింది. ఇక ఈసినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ప్రసన్న కుమార్ ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.. రవితేజ గారు చాలా సీరియస్ రోల్ లో నటిస్తున్నారు.. డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రవితేజ స్వామి అనే మాస్ రోల్ లో.. మరోకటి ఆనంద్ చక్రవర్తి అనే క్లాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కథ వీరిద్దరి పాత్రల చూట్టూనే తిరుగుతుంది.. అంతేకాదు ఈసినిమాతో ఖచ్చితంగా వింటేజ్ రవితేజ గారిని మళ్లీ తెరపైకి తీసుకొస్తామని ప్రసన్న కుమార్ తెలిపాడు.

నిజానికి షూటింగ్ స్టార్ట్ అయ్యేముందు నేను సెట్స్ లో స్ట్రిప్ట్ లో ఇంప్రవైజ్ చేస్తుంటాను అని చెప్పారు.. కానీ ఇంతవరకూ మాత్రం అది జరగలేదు.. స్క్రిప్ట్ లో ఏముందో చూసి ఎంజాయ్ చేస్తుంటారు.. ఏదైనా సీన్ కాస్త ఇబ్బందిగా అనిపించినప్పుడు మాత్రం ప్రసన్నా నాకు ఇక్కడ నీ సహాయం కావాలి అని అడుగుతారని తెలిపాడు.

ఈసినిమాలో మలయాళం యాక్టర్ జయరాం కూడా నటిస్తున్నారు.. ఆయన ఈసినిమాకు సర్ ప్రైజింగ్ ప్యాకేజ్ లాంటి వారు.. స్క్రీన్ పై ఆయన పెర్ఫామెన్స్ ను చూడటానికి రెండు కళ్లూ సరిపోవని.. ఈసినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.. ఆయన టేక్ చేసేటప్పుడు మొదటి షాట్ కరెక్ట్ గా వచ్చినా కూడా మరో షాట్ చేస్తానని అడిగేవారు.. ఇంకా రావు రమేష్, హైపర్ ఆదిల మధ్య ఎపిసోడ్స్ కూాడా హిలేరియస్స్ గా ఉంటాయి.

ఈసినిమాలో రవితేజ పక్కన నటిస్తున్న శ్రీలీల గురించి చెబుతూ.. ఇప్పటివరకూ నేను చూసిన హీరోయిన్లలో శ్రీలీల బెస్ట్ యాక్టర్.. ఏదైనా సీన్ గురించి శ్రీలల కు చెబుతూ మనం ఎలాంటి అవుట్ పుట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నామో అలాంటి అవుట్ పుట్ నే ఇస్తుంది.

ఇప్పటివరకూ ఐదు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.. ఇంకా 25రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది.. పాటలు, ఇంకా షూటింగ్ కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు పెండింగ్ లో ఉన్నాయి.. మరికొద్ది రోజుల్లో మొత్తం పూర్తవుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here