కన్నడ రాక్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కె.జి.యఫ్ 2. కె.జి.యఫ్ పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో కె.జి.యఫ్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల ఏప్రిల్ 14న ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా.. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ మళ్లీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఉమెన్స్ డే సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో పలువురు నటీమణులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈనేపథ్యంలో ఉమెన్స్ డే సందర్భంగా వారందరికీ సంబంధించి స్పెషల్ పోస్టర్ ని డిజైన్ చేస్తూ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరోయిన్ శ్రీనిథి శెట్టి, ఈశ్వరి రావు, రవీనా టాండన్, అర్చన జోయిస్, మాళవిక అవినాష్ లు ఉన్నారు.
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్‌లతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ఇంకా రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: