పోల్ గేమ్ : ఎన్టీఆర్ కాంబినేషన్ లో బెస్ట్ డైరెక్టర్ ?

Which Among These Is The Best Combination? Vote Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, S. S. Rajamouli,Student No 1 Movie,SS Rajamouli Yamadonga Movie,Jr NTR And Rajamouli Simhadri Movie,SS Rajamouli Ram Charan and Jr NTR Movie RRR, Director VV Vinayak,Aadi Movie,VV Vinayak with Jr NTR Movie Aadi,VV Vinayak Samba Movie,Adhurs Jr NTR Movie,VV Super Hit Movie Adhurs, Director koratala siva,Janatha Garage Movie,Janatha Garage Koratala Siva Super Hit Movie,koratala Siva Movies with Jr NTR, Puri Jagannadh,Temper Direcotr Koratala Puri Jagannadh,JR NTR Blockbuster Movie Temper,Temper Director Puri Jagannadh Movie, Director Sukumar,Naannaku Prematho Movie,Jr NTR and Rakul Preet Singh in Naannaku Prematho Movie,Jr NTR Superhit Movie naannaku Prematho,Jr NTR Movies,JR NTR with Sukumar Movies, Director Trivikram Srinivas,Jr NTR Aravinda Sametha Veera Raghava Movie,Trivikram Srinivas Super Hit Movie Aravinda Sametha Veera Raghava,Pooja Hegde and Jr NTR movie Aravinda Sametha Veera Raghava,

రాజమౌళి: యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో స్వప్న సినిమా బ్యానర్ పై తెరకెక్కిన “స్టూడెంట్ నెం 1”, విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన “సింహాద్రి “, విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన “యమదొంగ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివి వినాయక్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ , వినాయక్ కాంబినేషన్ లో లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన “ఆది “, కొడాలి మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కిన “సాంబ “, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన “అదుర్స్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. కామెడీ టచ్ తో , యాక్షన్ ఎంటర్ టైనర్ గా “అదుర్స్ ” మూవీని తెరకెక్కించి దర్శకుడు వినాయక్ అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించారు.

కొరటాల శివ : మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ , సమంత జంటగా రూపొందిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించారు. హీరో ఎన్టీఆర్ , మోహన్ లాల్ ల స్క్రీన్ ప్రెజెన్స్ , పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొరటాల శివ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో “NTR30″మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

పూరి జగన్నాథ్ :పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టెంపర్ ” మూవీ ఘనవిజయం సాధించింది. కరెప్టెడ్ , క్రిమినల్ మైండ్ పోలీస్ ఆఫీసర్ గా తరువాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మారడం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో ఎన్టీఆర్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.. “టెంపర్ ” మూవీ తమిళ భాషలో “అయోగ్య “గా రీమేక్ అయ్యి తిరిగి తెలుగు లో డబ్బింగ్ కావడం విశేషం.

సుకుమార్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “నాన్నకు ప్రేమతో “మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ , రకుల్ జోడీ ప్రేక్షకులను అలరించింది. తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాన్ని ఒక రివెంజ్ స్టొరీగా మార్చి తెరకెక్కించిన సుకుమార్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్: హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా “అరవింద సమేత వీర రాఘవ “మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా రాయలసీమ యాసలో తారక్ చెప్పిన డైలాగ్స్, తన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పోల్ గేమ్ : ఎన్టీఆర్ కాంబినేషన్ లో బెస్ట్ డైరెక్టర్ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − nine =