“భీమ్లా నాయక్ “మూవీ హిందీ వెర్షన్ రిలీజ్

Pawan Kalyan And Rana Daggubati's Bheemla Nayak To Release In Hindi

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్ 1 తేది రిలీజ్ కానుందని నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.”భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“భీమ్లా నాయక్” మూవీ ని హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “భీమ్లా నాయక్” మూవీ హిందీభాష లోనూ విడుదల అవుతుందని చెప్పారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “భీమ్లా నాయక్” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eight =