తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” , “పొన్నియిన్ సెల్వన్ “ తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం“రామ్ ” (మలయాళ ) , “ద్విత్వ ” కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు వెబ్ సిరీస్”బృంద” షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూర్య వంగల దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “బృంద”తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ లో త్రిష పవర్ ఫుల్ కాప్ గా నటిస్తున్నారు. కరోనా నుండి కోలుకున్న త్రిష ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సీనీర్ హీరోయిన్ త్రిష తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా పోలీస్ యూనిఫామ్ లో కనిపించనుండడంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “బృంద”తెలుగు వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: