మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. ఇక గత ఏడాది రిపబ్లిక్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలపై రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందో ఈసినిమాలో చూపించాడు. ఇక ఇటీవలే సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే కదా. గత ఏడాది సెప్టెంబరులో బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే సాయి తేజ్ పూర్తిగా కోలుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా ఒక అప్ డేట్ ఇచ్చాడు. కమ్ బ్యాక్ ఎప్పుడూ సెట్‌బ్యాక్ కన్నా బలంగా ఉంటుంది అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు సాయిధరమ్. దీన్నిబట్టి త్వరలో సాయి తేజ్ కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడన్న విషయం మాత్రం అర్థమవుతుంది.
The comeback is always stronger than the setback pic.twitter.com/2ssNlVR82Z
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 16, 2022
ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: