ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ‘రాజ రాజ చోర’ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో భళా తందనాన సినిమా కూడా ఒకటి. చైతన్య దంతులూరి దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసేసింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి `మీనాచ్చీ మీనాచ్చీ` అనే మొదటి సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందించగా.. త్రిపురనేని కళ్యాణచక్రవర్తి సాహిత్యం అందించగా, ధనుంజయ్ సీపాన పాడారు.
#BhalaThandhanana music fest begins with #MeenaaccheeMeenaacchee💃
Full Lyrical song is out now on @MangoMusicLabel!
A #ManiSharma musical🎼@CatherineTresa1 @SaiKorrapati_@VaaraahiCC pic.twitter.com/qm8Rm4EO7M
— Sree Vishnu (@sreevishnuoffl) January 15, 2022
కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. ‘కె.జి.యఫ్’లో గరుడ రామ్ గా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: