మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ల నిర్మాణంలో ప్రస్తుతం రెండు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తుంది. రమేష్ కాదూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈరెండు బ్యానర్స్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. మత్తు వదలరా డైరెక్టర్ రితేష్ రానా ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈసినిమాను కూడా రీసెంట్ గానే హైద్రాబాద్ లో లాంచ్ చేశారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈనేపథ్యంలో లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ లో మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తోంది.
Presenting the Title & First Look of our Pan Telugu Film🤘
Prod No. 3 of @ClapEntrtmnt is titled ‘HAPPY BIRTHDAY’
It’s a HAPPY BIRTHDAY for @Itslavanya 🎉#HBDLavanyaTripathi ❤️@RiteshRana #NareshAgastya #Satya @vennelakishore @kaalabhairava7 @sureshsarangam @MythriOfficial pic.twitter.com/XTQz4gt30U
— Clap Entertainment (@ClapEntrtmnt) December 15, 2021
ఇంకా ఈసినిమాలో ఈసినిమాలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా సురేష్ సరంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: