ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు పెరగడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అర్జున్
ఈసినిమాకు ఫస్ట్ అంత క్రేజ్ రావడానికి కారణం ఈసినిమా నుండి మొదట రిలీజ్ అయిన ఫస్ట్ లుక్. ఫస్ట్ లుక్ చూసిన అందరూ పోస్టర్ లో ఉంది నిజంగా బన్నీనేనా అన్నంత షాక్ అయ్యారు. అప్పటివరకూ స్టైలిష్ స్టార్ గా తన సినిమాల్లో స్టైలిష్ గా కనిపించిన బన్నీ ఈసినిమాలో ఒక్కసారిగా ఫుల్ రస్టిక్ అండ్ డీ గ్లామర్ లుక్ లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలా ఫస్ట్ లుక్ నుండి మొదలైన క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో ఈసినిమాలో నటిస్తున్నాడు బన్నీ. ఇన్నేళ్ల తన కెరీర్ లో బన్నీ ఇలాంటి పాత్ర చేయలేదు.
సుకుమార్-బన్నీ కాంబినేషన్
సుకుమార్-బన్నీ కాంబినేషన్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హిట్ కాంబినేషన్ అని అందరికీ తెలుసు. ఇప్పటివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో మొదట వచ్చిన ఆర్య సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసు. ఆ తర్వాత వచ్చిన ఆర్య2 సినిమా కూడా మంచి హిట్ కొట్టింది. దీంతో ఈసినిమా ప్రకటించినప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. సుకుమార్-బన్నీ కూడా తాము తీయబోయే మూడో సినిమా డిఫరెంట్ గా ఉండాలని దాదాపు 12 ఏళ్లు వెయిట్ చేసి ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతారనే అనిపిస్తుంది ఈసినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన అప్ డేట్స్ చూస్తుంటే..
కథ
ఈసినిమాపై ఆసక్తి కలగడానికి ఉన్న రీజన్స్ లో కథ కూడా ఒకటి. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈ స్టోరీని వెబ్ సిరీస్ తీయాలని సుకుమార్ అనుకున్నట్టు ఇప్పటికే తెలిపాడు. అందుకే మొత్తం కథను రెండున్నర-మూడు గంటల్లో చూపించడం కష్టం కాబట్టి రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక సుకుమార్ మేకింగ్ గురించి అందరికీ తెలుసు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లో చూడొచ్చు సుకుమార్ మేకింగ్ ఎలా ఉందో. అడవుల్లో ఎంతో మంది టీమ్ తో ఎన్నో ఇబ్బందులు పడుతూ షూట్ చేశారు. దాని రిజల్ట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
దేవి శ్రీ ప్రసాద్
సినిమాలో ఆల్బమ్ హిట్ అయితే సినిమా దాదాపు హిట్ అయినట్టే. ఇక సుకుమార్ సినిమా అంటే దాదాపు దేవి శ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటాడు. ఇక సుకుమార్ నమ్మకానికి తగ్గట్టే దేవి కూడా అలానే మ్యూజిక్ ఇస్తాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలోని పాటలు కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. ఫస్ట్ రిలీజ్ చేసిన దాక్కో దాక్కో మేక నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా పాట వరకూ అన్నీ వేటికవే డిఫరెంట్ గా ఉండి హిట్ అయ్యాయి. దాక్కో దాక్కో, శ్రీవల్లి పాట, సామి సామి పాట, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాట, ఊ అంటావా మావ పాట ఇలా అన్నీ పాటలను సూపర్ గా కంపోజ్ చేయగా ఇప్పుడు ఈపాటలు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.
థియేట్రికల్ రిలీజ్
ఇప్పటివరకూ చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అయితే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే. కొద్ది రోజుల వరకూ మేకర్స్ కాస్త భయంతో ఉన్నా.. రీసంట్ గా రిలీజ్ అయిన అఖండ సినిమా మంచి విజయం సాధించడంతో మేకర్స్ తమ సినిమా విషయంలో కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. ఇక బన్నీ అభిమానులతో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడు కూడా ఈసినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























