స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ), “పుష్ప “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ , ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” హిందీ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మనోజ్ బాజ్ పాయ్ , సమంత , ప్రియమణి ప్రధాన పాత్రలలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” వెబ్ సిరీస్ ఘనవిజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ లో సమంత డీ గ్లామర్ లుక్ , నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఓటీటీ నుంచి ది బెస్ట్ నటుల ఫీమేల్ జాబితాలో “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో నటనకు గానూ సమంతకు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ లభించినట్టు స్వయంగా ఫిల్మ్ ఫేర్ వారు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీనికి ఆనందంతో ఉప్పొంగిపోతూ సమంత థ్యాంక్స్ అంటూ రీ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: