మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.”పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , అనసూయ ముఖ్యపాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.“పుష్ప” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షక , అభిమానుల నుండి అనూహ్య స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ “పుష్ప ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 12న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరగనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిత్రయూనిట్ మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా “పుష్ప” మూవీ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: