మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు వచ్చినా వరుణ్ తేజ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభం నుండి మంచి మంచి చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ కేరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా గత కొద్ది రోజులుగా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ మధ్యలో కరోనా రావడం వల్ల షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఈమధ్య షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు సమాచారం అందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఇటీవలే ‘గని ఫస్ట్ పంచ్’ పేరిట మేకర్స్ ఒక వీడియోను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ గని రీచ్ అవుతాడో లేదో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 3న వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: