హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇంకా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మరో సినిమాను కూడా లాంచ్ చేశాడు. ఎడిటర్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలు ఉండగానే ఇప్పుడు మరో కొత్త సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో ఇప్పుడు ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి స్వామి రారా, కేశవ సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో అప్పుడే ఈసినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం లండన్ లోనే చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.
Excited to be teaming up with my dearest friend @actor_Nikhil once again. Happy to be associated with @SVCCofficial for #SVCC32 on the Auspicious Occasion of Dussehra 🙏🏹.
Produced by @BvsnP garu!
Can’t wait to share more details soon! pic.twitter.com/uHxjSwrIxr
— sudheer varma (@sudheerkvarma) October 15, 2021
కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఈసినిమా రూపొందుతుంది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: