నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది కూడా. అంతేకాదు ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ ఇప్పటికే తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నారు కూడా.
మరోవైపు నాగ్ అశ్విన్ కూడా ఈసినిమా షూటింగ్ కోసం ఫుల్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందకుంటే ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ నెలాఖరువరకూ ఈసినిమా షూటింగ్ అయిపోతుంది అన్నవార్తలు అయితే ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఈసినిమా తరువాత సలార్ కూడా లైన్ లో ఉండటంతో ఆసినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేయనున్నాడు. ఈసినిమా షూటింగ్ అయిపోవడానికి అటు ఇటుగా ఒక రెండు నెలలు పట్టినా ఈ ఏడాది సరిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలాగూ రాధేశ్యామ్ రిలీజ్ అవ్వబోతుంది. దాంతో ప్రభాస్ కాస్త ఫ్రీ అవ్వనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు..ప్రీప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని నాగ్ అశ్విన్ రెగ్యులర్ చిత్రీకరణకు రెడీగా ఉన్నారు. ప్రభాస్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు షూటింగ్ కు వెళ్లడానికి రెడీ గా ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. దీంతో ‘ప్రాజెక్ట్ కె’ నుండి అప్ డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఓ నెటిజన్ ఇదే విషయాన్ని నాగ్ అశ్విన్ ను అడుగాడు. ఈసినిమా ‘అప్‌డేట్ లేదా?’ అనిప్రభాస్ అభిమాని ఒకరు ట్విటర్‌లో ట్యాగ్ చేయగా దానికి సమాధానంగా నాగ్ అశ్విన్ ‘రాధేశ్యామ్’ విడుదలైన తర్వాతే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఉంటుందని తెలిపాడు. అంటే సంక్రాంతి దాకా ఎలాంటి అప్‌డేట్ లేదనే విషయం అర్థమవుతోంది. ఇది ఒక రకంగా అభిమానులను నిరాశ పరిచే విషయమనే చెప్పొచ్చు.
after radhe shyam release only..
— Nag Ashwin (@nagashwin7) October 11, 2021
కాగా ఈసినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: