ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన ”కొండపొలం ” మూవీ ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. కీరవాణి సంగీతం అందించారు. మూవీ రిలీజ్ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మీడియా తో ముచ్చటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో వైష్ణవ తేజ్ మాట్లాడుతూ … క్రిష్ వంటి గొప్ప దర్శకుడితో తన రెండవ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందనీ , “కొండపొలం” అనేది పూర్తిగా కొత్త తరహా కథాంశమనీ , ఎక్కువ భాగం అటవీ నేపథ్యంలో సాగే చిత్రమే అయినా ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయనీ , షూటింగ్ సమయంలో సాయిచంద్, కోట శ్రీనివాసరావు, రకుల్ వంటి సీనియర్స్ నుండి చాలా నేర్చుకున్నాననీ, సందేశంతోపాటు కమర్షియల్ హంగులూ మెండుగా ఉన్న కథ ఇదనీ , గొర్రెలు కాసే యువకుడి పాత్ర మొదట్లో కొత్తగా అనిపించినా క్రమంగా పాత్రలో లీనమై నటించాననీ , సంభాషణలు ప్రత్యేక యాసలో చెప్పాల్సి రావడంతో రోజు ప్రాక్టీస్ చేశాననీ , గొర్రెలపై సన్నివేశాలు చిత్రీకరించేటపుడు వాటి భాషని అర్థం చేసుకోలేకపోయాననీ , వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని కొన్నాళ్లకి తెలియడం తో గొర్రెలను కంట్రోల్ చేశానానీ , ప్రస్తుతం గిరి సాయి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాననీ , పాత్ర డిమాండ్ మేరకు రెండు చిత్రాల్లోనూ కాస్త డీ గ్లామర్‌గా కనిపించిన తాను ఈ మూవీ లో కొత్తగా కనిపిస్తాననీ , ఈ కథ రొమాంటిక్- కామెడీ నేపథ్యంలో సాగుతుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: