సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాలే కాదు సేవా కార్యక్రమాలు, బిజినెస్, ఇలా ఒకటేమిటీ అన్ని రంగాల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎన్ని పనులు ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా మహేష్ బాబు తన ఫ్యామిలీ కి ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు ఫ్యామిలీ పరంగా కానీ.. ఇటు కెరీర్ పరంగా కానీ మహేష్ సూపర్ సక్సెస్ లో ఉన్నాడు. మరి మహేష్ సక్సెస్ వెనుక నమ్రత కూడా ఉందన్న సంగతి ఒప్పుకోవాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ మరియు నమ్రతలది ప్రేమ వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే. ‘వంశీ’ సినిమాలో కలిసి నటించి అప్పుడే ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆ సినిమా టైంలో ఫోటోషూట్ చేయించారు. కానీ తర్వాత వీరిద్దరూ కలిసి ఫోటోషూట్ చేయించలేదు. చాలా ఏళ్ల తర్వాత మహేష్ మరియు నమ్రతలు కలిసి ఓ ఫోటోషూట్ నిర్వహించారు. సినీ మ్యాగజైన్ ‘హలో’ కోసం వీరిద్దరు కలిసి స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఆ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో మహేష్ నమ్రతలు చాలా స్టైలిష్ గా ఉన్నారు.
ఇక ఈసందర్భంగా జరిగిన ఇంటర్య్వూలో మహేష్-నమ్రత పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అదేంటంటే.. ప్రస్తుతం నా కెరీర్ చాలా బావుంది.. అందుకు చాలా సంతోషంగా ఉన్నాను.. నిజానికి స్టార్ట్ డమ్ ను మైన్ టైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు.. ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అవ్వడం అంటే ఛాలెంజింగ్ తో కూడిన పని.. నా కెరీర్ స్టార్టింగ్ నుండి నా స్క్రిప్ట్స్ ను నేనే సెలక్ట్ చేసుకుంటాను.. ఒకసారి ఒకే అయిన తరువాత ఇక దాని గురించి ఎలాంటి డిస్కషన్స్ చేయను.. నమ్రతతో కూడా చర్చలు జరపను.. ఒక్కోసారి నిర్ణయాలు తప్పవ్వచ్చు.. కానీ వాటివల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలిపారు. ఒక సినిమా ఆడనప్పుడు చాాలా బాధగా ఉంటుంది.. ఒకప్పుడు ప్రయోగాత్మక సినిమాల వల్ల అటూ ఇటు గా ఉండేది.. ప్రయోగాత్మక సినిమాలు వర్కవుట్ కావు.. కానీ గత కొద్దికలాంగా అయితే కెరీర్ బాగానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు.
A ‘Couple’ of Magical Moments✨
Here’s a Sneek Peek in to the world of Ghattamaneni’s !
SuperStar @urstrulyMahesh 💫#NamrataGhattamaneni @HELLOmagIndia @jatinkampani @grtjewellers @DeccanChronicle #MaheshBabu #SSMBSpace pic.twitter.com/w2fXODDUZf
— Mahesh Babu Space 🌟 (@SSMBSpace) October 4, 2021
కాగా మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: