నమో క్రియేషన్స్ బ్యానర్ పై రవి చరణ్ దర్శకత్వంలో తెలుగులో ఎన్నో చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన అమిత్ తివారి ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు . యాంకర్ కమ్ నటి భానుశ్రీ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే సంఘటనల నేపథ్యంలో మూవీ లో నాజర్ , తనికెళ్ల భరణి , అజయ్ ఘోష్ , ఛత్రపతి చంద్ర శేఖర్ ముఖ్య పాత్రలలో నటించారు. పిఆర్ సంగీతం అందించారు. “నల్లమల” మూవీ మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గురువారం ఉదయం ”నల్లమల” సినిమా టీజర్ ను దర్శకుడు దేవకట్టా విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు. 1980 జులై 23 ఇరాన్-ఇరాక్ యుద్ధం మొదలయ్యే ముందు రోజులవి. అప్పుడప్పుడే నల్లమలలో అంతర్యుద్ధం మొదలైంది’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇది పులులు ఉండే చోటు అని తెలియదా?’ అని కాలకేయ ప్రభాకర్ అంటుండగా ఇక్కడ ఉన్నది కూడా పులే కదయ్యా..అని అమిత్ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: