‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీసింహా మొదటిసినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆతరువాత ‘తెల్లవారితే గురువారం’ సినిమా చేశాడు కానీ అది అనుకున్నంత సక్సెస్ ను అయితే ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘భాగ్ సాలే’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా భాగ్ సాలే సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుండగా తాజాగా దొంగలున్నారు జాగ్రత్త సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. అయితే చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేశారు. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ ఒక చిన్నవీడియో ద్వారా తెలియచేసింది. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ వీడియోలో శ్రీ సింహ కెమెరా మెమరీ కార్డ్ దొంగతనం చేసి జాగ్రత్తలు చెబుతున్నాడు.
WARNING ⚠️ – Dongalunnaru Jaagratha#DLJTheFilm Shoot Begins !
▶️ https://t.co/264q4OAKdM@Simhakoduri23 @thondankani #PreethiAsrani @SathishTripura @yeshhu92 @garrybh88 @SureshProdns @gurufilms1
— Sri Simha Koduri (@Simhakoduri23) September 18, 2021
కాగా సతీష్ త్రిపుర ఈ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రీతి ఆస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో సముద్రఖని కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ‘‘దొంగలున్నారు జాగ్రత్త’’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రోహిత్ కులకర్ణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. మరి ఈసారి దొంగగా మారిన శ్రీ సింహా ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























