ఈ ఏడాది ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ఇప్పుడు గల్లీ రౌడీ అంటూ వస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించారు. నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇందులో బాబీ సిన్హా విలన్ గా నటిస్తున్నాడు. ఏవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఎలా ఉంది.. సందీప్ కు ఎలాంటి విజయం అందించిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: సందీప్ కిషన్, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ మురళి, బాపినీడు, వెన్నెల కిషోర్, వైవా హర్ష, తదితరులు
దర్శకత్వం: జి.నాగేశ్వర్ రెడ్డి
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమా
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
సంగీతం: రామ్ మిర్యాల, సాయికార్తీక్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్
కథ..
మీసాల సింహాచలం (బాపినీడు) వైజాగ్‌లో పెద్ద రౌడీ. ఆయన కొడుకు మీసాల అప్పన్న(ప్రకాష్‌రాజ్)ని యాక్సిడెంట్‌లో చంపేస్తాడు బైరాగి నాయుడు (మైమ్ గోపీ). వాసు (సందీప్ కిషన్) తాతే బాపినీడు. అయితే వాసు మాత్రం గొడవలకు దూరంగా ఉంటూ బాాగా చదువుకొని సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. కానీ వాసు చదువు మాన్పించి రౌడీగా తయారు చేయాలనుకొంటారు. ఇక వాసు కూడా అయిష్టంగానే రౌడీగా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో పోలీస్ ఇన్స్‌పెక్టర్ వెంకటరావు (రాజేంద్ర ప్రసాద్) కూతురు సాహితి (నేహా శెట్టి)తో వాసు ప్రేమలో పడుతాడు. మరోవైపు వెంకటరావు భూమిని బైరాగి నాయుడు కబ్జా చేస్తాడు. దాంతో వెంకటరావు కుటుంబం వాసుతో కలిసి బైరాగిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తుండగానే బైరాగి హత్యకు గురవుతాడు. దాంతో రంగంలోకి దిగుతాడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ రవి (బాబీ సింహా). ఈనేపథ్యంలో సందీప్ కిషన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. బైరాగిని ఎవరు హత్య చేశారు? అసలు వాసును తన తాత ఎందుకు రౌడీ చేయాలని అనుకొంటాడు? అన్న విషయాలు తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
విశ్లేషణ
సందీప్ కిషన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి యాక్టివ్ గా ఉండే పాత్రలు సందీప్ కిషన్ ఇప్పటికే నటించాడు కూడా. ఇక ఈసినిమాలో కూాడా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు.
వాసు పాత్రలో సులభంగా ఒదిగిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలాంటి పోలీస్ పాత్రలు చాాలానే చేశారు. సీరియస్ గా ఉంటూనే తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎలా నవ్వించాలో రాజేంద్రప్రసాద్ కు తెలుసు. ఈసినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ భయపడే హెడ్ కానిస్టేబుల్ పాత్రలో నవ్వించడమే కాదు, నష్టపోయిన సగటు మధ్య తరగతి వ్యక్తిగా ఎమోషనల్‌గానూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నేహాశెట్టి కూడా అందంగా అలానే సహజంగా నటించి మెప్పించింది. మెయిన్ విలన్‌గా నటించిన మైమ్ గోపి.. విలనిజాన్ని చక్కగా పండించాడు. ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన బాబీ సింహకు కూడా మంచి ఎలివేషన్ దక్కింది. ఇక వైవా హర్ష, వెన్నెల కిషోర్, షకలక శంకర్ తదితరులు తమ పాత్రలమేర కామెడీతో నవ్వించారు.
ఇక కథ గురించి చెప్పుకుంటే పెద్దగా లాజిక్కులు ఏం లేకపోయినా అందరికీ తెలిసిన కథే. అయితే తన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశారు కోన వెంకట్. తెలిసిన విషయాలనే సింపుల్‌గా, ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించారు. కామెడీ సినిమాలను తెరకెక్కించడంతో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి సినిమాను చక్కగా హ్యాండిల్ చేశాడు.సాయికార్తీక్, చౌరస్తా రామ్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీనే కీలకంగా తెరకెక్కించిన ఈ గల్లీరౌడీ అందరినీ బాగానే నవ్విస్తాడు
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: