బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ “సాహో “మూవీ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 4 మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్ “సలార్ “, “ఆదిపురుష్ “, “ప్రాజెక్ట్ K “మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ ఫేస్ బుక్ లో 24 మిలియన్ ఫాలోయర్స్ తో ఇండియన్ స్టార్ హీరోల్లో ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న స్టార్స్ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. 50.7 మిలియన్ ఫాలోయర్స్ తో నెం.1 స్థానంలో సల్మాన్ ఖాన్ రెండవ స్థానంలో అక్షయ్ కుమార్ , మూడవ స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిలిచారు. తరువాత అమితాబచ్చన్, కపిల్ శర్మ, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ , అజయ్ దేవగన్ లు ఉన్నారు. ప్రభాస్ కు ఈ జాబితాలో 9వ స్థానం దక్కింది.బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడి మరీ ప్రభాస్ ఈ జాబితాలో 9వ స్థానంలో నిలవడం విశేషం. టాప్ 10 లో సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో ఏ ఒక్కరికి కూడా చోటు లేదు. భారీ ఎత్తున అంచనాలున్న సినిమాలను చేయడంతో పాటు అక్కడ ప్రభాస్ నటించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభాస్ కు ఏకంగా టాప్ 10 లో చోటు దక్కింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: