సూర్య 40 ఫస్ట్ లుక్..గత కొద్దిరోజులుగా సూర్య 40 ఫస్ట్ లుక్ గురించి ఎన్ని వార్తలు వచ్చాయే చూస్తూనే ఉన్నాం. ఇక ఫ్యాన్స్ కూడా ఫస్ట్ లుక్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటినుండో సూర్య ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు కానీ ఎప్పటికప్పుడూ లేట్ అవుతూనే ఉంది. ఫైనల్లీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. రేపు సూర్య పుట్టినరోజు. ఈసందర్భంగా ఒకరోజు ముందుగానే చిత్ర బృందం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సూర్య 40వ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. అభిమానుల అంచనాలకు తగ్టట్లుగానే ఢిపరెంట్ గెటప్‌లో సూర్య కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మాస్ లుక్ లో ఉన్నాడు సూర్య. ఇక ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Suriya40 is #EtharkkumThunindhavan⁰
Here is the first look:https://t.co/qNsXcGGvZF⁰@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop @priyankaamohan @sooriofficial ⁰#ET #எதற்கும்துணிந்தவன் #Suriya40FirstLook #HappyBirthdaySuriya— Sun Pictures (@sunpictures) July 22, 2021
కాగా పాండిరాజ్ దర్శకత్వంలో ఎదర్కుం తునిందవన్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. డి ఇమ్మాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























