ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా వాడి వాసల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా జల్లి కట్టు నేపథ్యంలో తెరకెక్కుతండగా.. దానికిగాను సూర్య బుల్ ఫైట్ కూడా నేర్చుకుంటున్నాడు. సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో 40వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ప్రీ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వైయిటింగ్. ఇక తాజాగా దీనికోసం మేకర్స్ డేట్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ ట్వీట్ చేశారు. సూర్య పుట్టినరోజు సందర్భంగాజూలై 22 సాయంత్రం 6 గంటలకు ఆయన 40వ చిత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Suriya40FirstLook on July 22 @ 6 PM!#Suriya40 #Suriya40FLon22nd@Suriya_offl @pandiraj_dir @immancomposer @RathnaveluDop @priyankaamohan pic.twitter.com/ZzMNetQf8y
— Sun Pictures (@sunpictures) July 19, 2021
కాగా ఈసినిమాలో ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ సూర్యకి జంటగా నటిస్తోంది. భారి బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమా నిర్మిస్తుంది. డి ఇమ్మాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























