రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను రెండు రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఈరోజు రామ్ సెట్స్ కి వచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “సోమవారం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. హీరో రామ్, హీరోయిన్ కృతి శెట్టి, నదియా తదితరులపై లింగుసామి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సడన్ గా సెట్స్‌కు వచ్చిన శంకర్ గారిని చూసి టీమ్ అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ఆయనకు రామ్, కృతి, నదియా, లింగుసామి స్వాగతం పలికారు. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన లవ్ సాంగ్ ట్యూన్ వినిపించారు. మెలోడీయస్ గా ఉందని, చాలా బావుందని ఆయన ప్రశంసించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది” అని అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: