కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడిప్పుడే నార్మల్ కు వస్తున్న నేపథ్యంలో మళ్లీ అందరూ షూటింగ్ లను మొదలు పెడుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఆల్ రెడీ షూటింగ్ లను మొదలు పెట్టి పెండింగ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక ఈనేపథ్యంలో నేడు చాలా సినిమాలు మళ్లీ సెట్స్ మీదకు వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎఫ్3 ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ రావడంతో మళ్లీ ఇన్ని రోజులకు ఇప్పుడు షూట్ ను స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ బీస్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బీస్ట్ మొదటి షెడ్యూల్ జార్జియాలో పూర్తయింది. నేటి నుండి కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. పూజా హేగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మరోవైపు రవితేజ ఒకపక్క రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తూనే మరోపక్క నూతన దర్శకుడు శరత్ మందవను పరిచయం చేస్తూ కొత్తసినిమాను చేస్తున్నాడు. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఈరోజు నుంచే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: