మహా సముద్రం.. ‘కె.జి.యఫ్’ విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్

Mahasamudram Movie Team Unveils KGF Villain Garuda Ram First Look,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,KGF Villain Garuda Ram First Look,KGF Villain,Mahasamudram Movie,Ajay Bhupathi,Sharwanand,Siddharth,First Look,KGF Villain In Maha Samudram,KGF Villain In Maha Samudram Movie,Maha Samudram Telugu Movie,Maha Samudram,Maha Samudram Updates,Maha Samudram Movie Updates,Maha Samudram Movie Latest Updates,Maha Samudram Movie Ram First Look,KGF Villain Garuda Ram First Look,Garuda Ram First Look From Maha Samudram,Sharwanand And Siddharth,Sharwanand And Siddharth Movie,Sharwanand And Siddharth Maha Samudram,Sharwanand New Movie,Sharwanand Movies,Ram First Look From Maha Samudram,Garuda Ram’s First Look As Dhanunjay,Garuda Ram’s First Look From Maha Samudram,Garuda Ram’s First Look From Maha Samudram,Garuda Ram As Dhanunjay,Maha Samudram KGF Villain Garuda Ram First Look,Maha Samudram Garuda Ram First Look,Raam,Raam First Look From Maha Samudram,Garuda Raam As Dhanunjay,#MahaSamudram

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల షూట్ కు బ్రేక్ పడగా.. త్వరలోనే మళ్లీ రీస్టార్ట్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో కె.జి.యఫ్ ఫేమ్ గరుడ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. కన్నడ, తమిళ్ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించిన గరుడ రామ్ ఈ సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ శర్వా, సిద్దార్ధ్, జగపతి బాబు, రావు రమేష్ ఇలా పలువురి పోస్టర్లు రిలీజ్ చేయగా ఈసినిమా నుండి నేడు గరుడ రామ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ చూస్తుంటే ఈసినిమాలో కూడా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్టే అర్థమవుతుంది. ధనుంజయ అనే పాత్రలో నటిస్తున్నగరుడ రామ్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లను బట్టి అజయ్ భూపతి ప్రతి క్యారెక్టర్ ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేసినట్టే అనిపిస్తుంది.

కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =