షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురుల్ స్టార్ నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు.హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు. ” శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా రూపొందనున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికి !” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేయడానికి నాని నిర్ణయం తీసుకున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శ్రీకాంత్ దర్శకత్వంలో మరో మూవీ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సంవత్సరం “టక్ జగదీష్ ” , “శ్యామ్ సింగ రాయ్ “, “అంటే .. సుందరానికి !” మూవీస్ తో హీరో నాని సందడి చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: