“1:నేనొక్కడినే ” మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కృతి కథానాయికగా రూపొందిన బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ “మూవీలో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కృతి ఇప్పుడు ఒక హాలీవుడ్ రీమేక్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. హాలీవుడ్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ క్వింటెన్ ట్యారంటీనో దర్శకత్వంలో తెరకెక్కిన మార్షల్ ఆర్ట్స్ “కిల్ బిల్ “మూవీ 2003 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ హిందీ భాషలో రీమేక్ కానుంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో కృతి సనన్ ప్రధాన పాత్రలో “కిల్ బిల్” హిందీ రీమేక్ సినిమా తెరకెక్కనుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కృతి ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: