‘ఫలక్ నుమా దాస్’.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Vishwak Sen Starrer Falaknuma Das Movie World Television Premiere On Star Maa,Telugu Filmnagar,Telugu Film News 2021,Vishwak Sen,Hero Vishwak Sen,Actor Vishwak Sen,Tharun Bhascker,Harsita Gaur,Saloni Mishra,Uttej,Vivek Sagar,Falaknuma Das Telugu Full Movie,Falaknuma Das Telugu Full Movie,Falaknuma Das,Falaknuma Das Telugu Full Movies,Falaknuma Das Full Movie,Falaknuma Das Movie,Falaknuma Das Telugu Full Movie,Falaknuma Das Telugu Full Movie On Star Maa,Falaknuma Das Telugu Movie,Telugu Filmnagar,Falaknuma Das Telugu Full Movie On Star Maa,Vishwak Sen Falaknuma Das,Vishwak Sen New Movie,Vishwak Sen Movies,Watch Falaknuma Das Telugu Full Movie,Falaknuma Das Full Movie on Star Maa,Falaknuma Das Full Movie Online,Falaknuma Das,Falaknuma Das Full Length Movie,Falaknuma Das World Television Premiere Tomorrow On Star Maa,Star Maa,Falaknuma Das On Star Maa Tomorrow,Falaknuma Das World Television Premiere Tomorrow,Falaknuma Das On Star Maa,#FalaknumaDas

టాలీవుడ్‌‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వెళ్లిపోమాకే అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై.. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫలక్ నుమా దాస్ సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ కేవలం హీరోగా మాత్రమే కాదు దర్శక నిర్మాతగా మారి ఈసినిమాను తెరకెక్కించాడు. 2019 మే 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమాలో పక్కా హైద్రాబాదీ ఎట్మాస్ఫియర్ తో పాటు తెలంగాణ స్లాంగ్ ను వాడుకున్నాడు విశ్వక్ సేన్. ఇక ఈసినిమా హిట్ అవ్వడమే కాదు మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సిల్వర్ స్క్రీన్ పై అలరించిన ఈసినిమా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా అలరించడానికి వచ్చేస్తుంది. స్టార్ మా లో ఈసినిమా వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ అవుతుంది. రేపు అంటే మే 16న స్టార్ మా ఛానెల్ లో మధ్యాహ్నం 3గంటలకు ప్రసారంకానుంది. మరి బుల్లితెరపై కూడా ఈసినిమా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. కాగా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈసినిమాలో విశ్వక్ సేన్ తో పాటు సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి, తరుణ్ భాస్కార్, ఉత్తేజ్ తదితరులు నటించారు.

ఇదిలాఉండగా ఎప్పుడూ.. ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకునే విశ్వక్ సేన్ లిస్ట్ లో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో పాగల్ సినిమా ఒకటి. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘పాగల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమాతో పాటు ద్యాసాగర్‌ దర్శకత్వంలో ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాను బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో భోగవల్లి బాపినీడు, ఇ. సుధీర్‌ నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =