ఆన్ లైన్ చీటింగ్.. మెగా హీరో ఫైర్

Supreme Hero Sai Dharam Tej Takes Legal Action Against An Online Fraud Impersonating His Name,Telugu Filmnagar,Telugu Film News 2021,Supreme Hero Sai Dharam Tej,Sai Dharam Tej,Actor Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Sai Dharam Tej Takes Legal Action Against,Mega Hero Sai Dharam Tej Takes Legal Action,Supreme Hero Sai Dharam Tej,Sai Dharam Tej Takes Legal Action,Fraud In The Name Of Sai Dharam Tej,Supreme Hero Alerts Fans About An Unidentified Imposter,Sai Tej Files Criminal Case Against Imposter,Fraud In The Name Of Hero Sai Dharam Tej,Actor Sai Dharam Tej Warns Fans About Scammers,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Latest Film Update,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Takes Legal Action Against Imposter,Sai Tej Files Criminal Case Against Imposter,Sai Dharam Tej Posts An Alarming Message For Fans,Sai Dharam Tej Warns People

టెక్నాలజీ పెరగడంతోపాటు ఆన్ లైన్ మోసాలు కూడా బాగా పెరిగిన సంగతి తెలిసిందే కదా. ఇలాంటి మోసాలు పాల్పడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.. మోసపోయేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇక సెలబ్రిటీల పేరుతో జరిగే మోసాలు అయితే అనేకం. రీసెంట్ గానే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములను ఒక ఆన్ లైన్ స్కామర్ అవార్డ్ వచ్చిందంటూ దానికి రిజిస్టర్ చేసుకోవాలంటూ డబ్బులు ట్రాన్ఫర్ చేయాలంటూ అడుగగా.. వెంకీ కూడా చేశాడు. ఆ తరువాత కానీ అర్ధకాలేదు తను మోసపోయానని.. ఇప్పుడు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమంటున్నాడు మెగాహీరో సాయి తేజ్. అయితే తను మోసపోలేదులే కానీ తన పేరు చెప్పుకొని పాల్పడుతున్నారంటూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నా పేరు మీదుగా నేను నటించిన కో ఆర్టిస్ట్, ఇతర సభ్యుల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నాకు తెలిసింది. నాకు ఆర్థిక సాయం కావాలని వారిని డబ్బులు అడుగుతున్నానట. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.. అలాంటి వాటిని నమ్మకండి.. నా పేరు మీద వచ్చే మెసెజ్‌లను పట్టించుకోకండి అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం సాయి తేజ్ ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ద‌ర్శకుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శక‌త్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here