కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా పాత్ర ప్రధానమైన రోల్స్ చేయడంలో రానా ఎప్పుడూ ముందుటాడు. ఇక ఇప్పుడు రానా కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన విరాట పర్వం రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. మరోవైపు పవన్ తో కలిసి మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలతో పాటు గతంలోనే గృహం ఫేం మిలింద్ రౌ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో రానా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా ఈసినిమాను రూపొందించనున్నారట. మిలింద్ రావ్ ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో ‘నెట్రికన్’ అనే మిస్టరీ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఈ చిత్రం ఉండనుందని సమాచారం.
ఇక వీటితో పాటు తాజాగా మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సీహెచ్ రాంబాబుతో కలిసి ఈసినిమాను విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే ఈసినిమానే మిలింద్ రౌ సినిమా అన్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఈసినిమా అదేనా.. లేక అది వేరే సినిమానా అన్నది చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: