కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా తిరిగి కరోనా నిబంధనలతో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి సినిమా చేస్తుండగా మల్లిక పాత్రలో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. అంతేకాదు కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇక కార్తికేయ కూడా లావణ్యకు కాస్త కామెడీగా ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేశాడు. ఆ పోస్టర్‌ను షేర్ చేసిన హీరో కార్తికేయ.. `మల్లీ.. ఈ రోజు నీ హ్యాపీ బర్త్ డే అంటగా.. చెప్పనేలేదు.. నువ్వు అట్టాగే ఉండు.. సాయంత్రం మన బ్యాచ్‌ని అట్టుకొత్తా.. అల్లాడించేద్దాం అంతే` అని ట్వీట్ చేశాడు.
Malliii …iroj ne happy birthday antagaa ..cheppaneledhu..nuv attage undu sayantram mana batch ni attukotha..alladichedam anthe💪💪@Itslavanya https://t.co/JNHgKN5NxB
— Kartikeya (@ActorKartikeya) December 15, 2020
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈసినిమాతో పాటు లావణ్య త్రిపాఠి డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో “A1 ఎక్స్ ప్రెస్ ” సినిమాలో నటిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























