కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కథానాయిక శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ.. “ఒక తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న నాకు, సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి గారి ముందు మాట్లాడటం, ఆయన ఆశీస్సులు అందుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. ‘కలర్ ఫోటో’, ‘బేబీ’ వంటి చిత్రాల తర్వాత ఎస్కేఎన్, సాయి రాజేష్ గార్ల నిర్మాణంలో నటించడం గర్వంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా సహజంగా, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మణిశర్మ గారు అందించిన ప్రతీ పాట ఒక మ్యాజిక్. జూలై 24న థియేటర్లలో ఈ ‘చెన్నై లవ్ స్టోరీ’ మీ అందరి హృదయాలను ఖచ్చితంగా గెలుచుకుంటుంది” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























